
(పయనించే సూర్యుడు జనవరి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) యూనిట్-1 విద్యార్థులు శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా నాలుగవ రోజు అన్నారం గ్రామం సమీపంలోని కొండయగడ్డ తండాలోని వీధుల్లో పరిశుభ్రత-పచ్చదనంపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తండాలోని ప్రాథమిక పాఠశాల పరిసరాలను, తండా వీధులను చెత్త, చెదారం లేకుండా ఊడ్చి శుభ్రం చేశారు. తర్వాత తండాలోను, అన్నారం గ్రామ వీధుల్లోను ఇల్లిల్లూ తిరుగుతూ సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించారు. సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహించారు. భోజన విరామం తర్వాత కళాశాల కామర్స్ అధ్యాపకులు డా.అనురాధ రిసోర్స్ పర్సన్ గా విచ్చేసి, వాలంటీర్స్ కు "వినియోగదారుల హక్కులు" అనే అంశంపై అవగాహన కల్పించారు. ధైరాయిడ్ వ్యాధి నివారణకు తగిన సూచనలు ఇచ్చారు. గ్రామ పౌరులు లింగం మాట్లాడుతూ వాలంటీర్లను, వారి సేవలను కొనియాడారు. తర్వాత వాలంటీర్లలో కొందరు సైబర్ సెక్యూరిటీపై స్కిట్ ను ప్రదర్శించారు. సాయంత్రం యోగా-వ్యాయామాలు కొనసాగించారు. ఈ కార్యక్రమాలలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డా.ఎస్.రవి ప్రసాద్, కామర్స్ అధ్యాపకులు డా.అనురాధ, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు యాదగిరి, ఆంగ్లం అధ్యాపకులు కె.అరుణ, గ్రామ సర్పంచ్ శ్రీమతి సి.లావణ్యరామకృష్ణ పంచాయతీ సెక్రటరీ రాఘవేంద్ర, ఉపసర్పంచ్ శివశంకర్ మరియు వర్డ్ సబ్యులు ఇతర గ్రామ పెద్దలు, 50 మంది ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు పాల్గొన్నారు.
