
పాల్గొన్న సర్పంచ్ లావణ్య రామకృష్ణ
( పయనించే సూర్యుడు జనవరి 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ మండల పరిధిలోని అన్నారం గ్రామ పంచాయతీ గుండ్యా నాయక్ తండాలో గురువారం షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు శ్రమదానం నిర్వహించారు. శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామంలో పరిశుభ్రత-పచ్చదనంపై నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం తండాలోని పరిసరాల వీధుల్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ. బన్సీలాల్ పాల్గొన్నారు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డా.ఎస్.రవి ప్రసాద్ తో పాటు ఎం.పి.డి.ఓ. బన్సీలాల్, అన్నారం గ్రామ సర్పంచ్ సి. లావణ్య, తండా వార్డ్ మెంబర్ కావ్య రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు నాటారు. తర్వాత విద్యార్థులు ఇంటింటికీ వెళ్లి సైబర్ మోసాలపై, బాల్య వివాహాలపై తండావాసులకు అవగాహన కల్పించడంతో పాటు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించారు. అనంతరం తండా వాసులకు సీసనల్ వ్యాధులు, వ్యాధుల నివారణ, అవి రాకుండా తీసుకొనవలసిన జాగ్రత్తలు వివరించారు. భోజన విరామం తర్వాత అన్నారం గ్రామ పొలిమేరలో ఉన్న నర్సరీలో శ్రమదానం చేశారు. అన్నారం గ్రామ వీధుల్లో పర్యావరణం పరిశుభ్రత పై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం యోగ- వ్యాయామాలు కొనసాగించారు. ఈ కార్యక్రమాలలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎస్.రవి ప్రసాద్, అధ్యాపకులు బి.యాదగిరి, డా. సందీప్, నాగలింగం, సర్పంచ్ సి.లావణ్య, పంచాయతీ సెక్రటరీ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
