దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇల్లు పూర్తిగా కూలిపోవడం జరిగింది. కుటుంబీకులు తలదాచుకుని చోటు లేక దిక్కు తోచని స్థితిలో నిరుపేద కుటుంబం. మండల పరిధిలో సూరంపల్లిగ్రామంలో అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బొల్లం లక్ష్మి పెంకుటిల్లు భారీ వర్షం కారణంగా తుడుకోవడం జరిగింది జీవనవసరాలు కూడా దెబ్బ తినడంతో ఆ కుటుంబం దిక్కు తోచన్ స్థితిలో కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలతో కష్టపడుతున్న తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నాను. ప్రభుత్వం తరఫున కానీ ప్రజా ప్రతినిధులు కానీ దాత రూపంలో ముందుకు రావాలని తమకు ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులు సాయం చేయాలని వారు కోరుకుంటున్నారు. గృహం నిర్మాణానికి దాతలు గాని ప్రభుత్వం గాని మమ్ములను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నాను