
పయనించే సూర్యుడు జనవరి 21 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా తడ మండలం మoబట్టు గ్రామం పరిధిలో ఉన్న అపాచీ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు వరుస మరణాలతో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు ఆ కంపెనీలో ఏం జరుగుతుందో దేవుడికే ఎరుక? బతకడం కోసం కంపెనీలో చేరితే అదే చావు గీతంలో మారుతుంది ఆ కంపెనీలో ఏం జరుగుతుందో పట్టించుకునే నాధుడే లేడా పని భారంతో అల్లాడుతున్న కార్మికులు రోజుకు పిడికెడ అన్నం తినే కార్మికుని బెసిన అన్నం తినమంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి కార్మికుల్ని బానిసృతంగా చేసుకొని ముగ్గురు చేయాల్సిన పనిని ఒక అతని దగ్గర చేపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి పొద్దున ఏడింటికి బస్సు ఎక్కితే తిరిగి ఎనిమిదింటికి బస్సు దిగుతున్నారు ఒక మనిషి 10 గంటలు 12 గంటలు పని చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇలాంటి వర్క్ ప్రెషర్ తో అపాచి కార్మికుల భయాందోళనలతో కాలం వెళ్లబోస్తున్నారు బతకడం కోసం కంపెనీలో చేరితే ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఆత్మహత్య శరణం అంటున్నారు లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఆ కారణాలు తెలుసుకుని నాథుడు ఎవరు.. కార్మికుల చట్టాలు ఈ కంపెనీ వర్తించవా ఇలాంటి అంత చిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఆ ప్రశ్నల్ని చేదించేదెవరు అపాచీ కంపెనీ మీద ఎన్నో ప్రశ్నలు ఆ ప్రశ్నలు వీటిని పరిష్కరించేదెవరు ఇంకా ఎంతమంది కార్మికులు ఆత్మహత్య చేసుకోవాలో ప్రభుత్వం ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ప్రజలకు పని కల్పించి ప్రజలని ఆర్థికంగా బలోపేతం చేయాలని చూస్తుందే కానీ కార్మికుల అనుభవిస్తున్న బాధల్ని అర్థం చేసుకునే నాథుడు లేరు ఈ కార్మికులు పడే కష్టాన్ని కన్నెత్తి చూడని ప్రభుత్వ అధికారులు యంత్రాంగం ఇలాంటి ఇకనైనా అపాచీ కంపెనీలో కార్మికుల ఆత్మహత్యలు ఆగేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి
