
//పయనించే సూర్యుడు //న్యూస్ డిసెంబర్ 23// నారాయణపేట జిల్లా బ్యూరో //
కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామ టిడిపి నూతన సర్పంచ్ గా బి మల్లేశ్వరి శ్రీనివాస్, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టిడిపి పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షుడు రాములు యాదవ్, నారాయణపేట పట్టణ అధ్యక్షుడు గోపాల్ యాదవ్,ఈరన్న గౌడ్ తో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు సర్పంచ్ పదవి అధికారం అని కాకుండా బాధ్యతగా స్వీకరించి గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని టిడిపి పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షుడు రాములు యాదవ్ అన్నారు గ్రామంలో అందరిని కలుపుకొని వారి సహకారం తీసుకొని గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేయాలని సూచించారు అదేవిధంగా మంచి పనులు చేసి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షుడు రాముల యాదవ్,ఈరన్న గౌడ్ నారాయణపేట పట్టణ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, నారాయణ, ఉపసర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు