పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 15:- రిపోర్టర్ (కే.శివకృష్ణ )
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫౌండేషన్ ప్రెసిడెంట్ ,గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాష తెలిపారు.కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం దండుబాటలోని మజీద్ సమీపంలో 16 మంది నిరుపేద మహిళలకు చీరెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథిగా జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మహిళలకి చీరెలు అందజేశారు.ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాష మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం ,నిత్యావసర సరుకులు ,దుప్పట్లు ,అనారోగ్యంగాఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలి ( కెప్టెన్ ఆర్మీ రిటైర్డు ) ,షేక్ ఇబ్రహీం, షేక్ బహదూర్ బాష ,షేక్ జిలాని ,షేక్ జానీ బాష ,షేక్ గపూర్ ,షేక్ హాబీబ్ తదితరులు పాల్గొన్నారు