పయనించే సూర్యుడు// న్యూస్ మే 8// నారాయణపేట జిల్లా బ్యూరో బి విశ్వనాథ్ //
నారాయణపేట జిల్లా కృష్ణ మండల్ ముడుమాల్ గ్రామంలో అబ్బురపరిచే నిలువురాళ్లు ఉన్నాయని అట్టి నిలువు రాళ్లను ప్రపంచ దేశాలా నలుమూలల నుండి వచ్చి సందర్శించాలని రచయిత KV నరసింహ తెలియజేశారు
ముడుమాల గ్రామంలోని అబ్బురపరిచే ఈ నిలువురాళ్లకు ఎంతో చరిత్ర ఉందని అందుకు ప్రపంచ దేశాల నలుమూలల నుండి వచ్చి సందర్శించాలని నిలువరాళ్ల చరిత్ర పుస్తక రచయిత కెవి నరసింహ పిలుపునివ్వడం జరిగింది అయితే ఇలాంటి వింతలు ప్రపంచంలో మరి ఎక్కడ లేవని అలాగే త్వరలోనే యునెస్కో గుర్తింపు వస్తుందని ప్రపంచ దేశాలలో అతి సుందరమైన ప్రదేశంలో పేరొందిన నిలువు రాళ్ళను ప్రతి ఒక్కరు చూస్తూ వాటి చరిత్రలను తెలుసుకోవాలని భావితరాలకు బాటలు వేయాలని అలాగే ఇలాంటి పురాతన కట్టడాలను ప్రతి ఒక్కరు చూసి తరించాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పుస్తక రచయిత కోరుతున్నారు నిలువరాల చరిత్ర ఒక ఎనిమిదవ వింతగా చరిత్రపుటల్లో పేరు రాస్తుందని కాబట్టి అలాంటి చరిత్రలను వింతలను ప్రతి ఒక్కరు తెలుసుకొని భావితరాలకు బాటలు వెయ్యాలని అలాగే జిల్లా రాష్ట్రాలు నుండి మరియు ఇతర దేశాల నుండి ముడుమాల నిలువు రాళ్ళను ప్రతి ఒక్కరూ వెళ్లి చూడాలని అలాగే దేశంలోనే పురాతన నిలువురాళ్ల పర్యాటక ప్రాంతం ఉంది కాబట్టి ప్రతి దేశం నుండి ప్రతి రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో పర్యాటకులు నిలువరాలను సందర్శించాలని నిలువు రాళ్ల చరిత్ర పుస్తక రచయిత కెవి నరసింహ కోరుతున్నారు