
సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ విక్రమ్ రెడ్డి
( పయనించే సూర్యుడు మార్చి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కొందుర్గు మండలం గంగన్నగూడ గ్రామంలో ఎన్ఆర్ఈ జీఎస్ నిధులతో సిసి రోడ్ నిర్మాణం పనులు చేయడం గ్రామ అభివృద్ధికి ప్రజల సౌకర్యార్థం ఎంతగానో మేలు జరుగుతుందని సర్పంచ్ విక్రమ్ రెడ్డి తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి గ్రామస్థుల సహకారంతో మరింతగా గ్రామాన్ని అభివృద్ధి యే లక్ష్యంగా పనులు చేస్తామని తెలిపారు. మునుముందు గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని ఉత్తమ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది ప్రతి వాడకు సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం పరిశుభ్రత పచ్చదనం చేపట్టే దిశగా కార్యక్రమాలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టెం దామోదర్ రెడ్డి , ఉపసర్పంచ్ పల్లె హనుమంత్, గోపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి జంగయ్య గౌడ్, కృష్ణా రెడ్డి, కృష్ణయ్య, లాలయ్య, ఉపేంద్ర, రాజేందర్ రెడ్డి, నర్సింలు,రామస్వామి, శ్రీను, ప్రవీణ్ రెడ్డి, మాధవ రెడ్డి,మల్లేష్, చెన్నయా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.