
రుద్రూర్, ఫిబ్రవరి 23 (పయనించే సూర్యుడు మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం (ఆర్) గ్రామానికి సంబందించిన మోడల్ స్కూల్, కళాశాల అదనపు తరగతి గదుల కోసం 50 లక్షల రూపాయలు, మెయిన్ రోడ్డు నుండి మోడల్ స్కూల్ వరకు సిసి రోడ్డు కొరకు 21 లక్షల రూపాయలు, గర్ల్స్ హాస్టల్ మరమ్మత్తుల కొరకు 33 లక్షల రూపాయలు, గ్రామానికి సంబందించిన సంస్కార్ ప్రహరీ కొరకు 45 లక్షల రూపాయలు మొత్తం ఒక్క కోటి 49 లక్షల అభివృద్ధి పనులకు సోమవారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమిపూజ చేశారు. నూతన పంచాయితీ పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిధులు గ్రామ మోడల్ స్కూల్ కు రావడంతో పంచాయితీ పాలకవర్గం సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయిప్రసాద్, వార్డు సభ్యులు శానం రుక్మవ్వ, కుర్మ బాలయ్య, సుంచు జ్యోస్నా, పవన్, శానం నాగమణి, గణేష్, రామసాని సాయిలు, బడే రాము, శానం గంగాధర్, అత్కూరి అశోక్, మోడల్ స్కూల్ చైర్మన్ పావని నరేష్, తహసీల్దార్ తారబాయి, ఎంపిడిఓ బాల గంగాధర్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
