
దీపాలను వెలుగించి సంతోషాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ రాజశేఖర్
దీపాలు వెలిగించి హర్షం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ రాజశేఖర్ కుటుంబం
పయనించే సూర్యుడు ఏప్రిల్ 5 ముమ్మిడివరం ప్రతినిధి
:ఆంధ్రప్రదేశ్ రాజధానిగా
అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు కొనసాగు తున్నాయి.ఈ సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ లోక్సభ, రాజ్యసభ మరియు కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించిన ఈ చారిత్రాత్మక సందర్భంగా, ఈరోజు సాయంత్రం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి శాసన మండలి సభ్యులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వగృహంలో దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి ఈ మహత్తర విజయాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అమరావతి సాధన ప్రతి ఆంధ్రుడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. రాష్ట్ర ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష నెరవేరిన ఈ శుభ సందర్భం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూతన దిశను చూపనుంది.
జై అమరావతి – జై రాజధాని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కాకినాడ.
