
పయ నించే సూర్యుడు ఆగస్టు 10 ముమ్మిడివరం ప్రతిని(ధి గ్రంధి నానాజీ)వికసిత్ భారత్ యువ రాజకీయ నాయకుల చర్చ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం 22, 23 తేదీల్లో విజయవాడలో జరుగుతుంది. ఏదైనా వృత్తిలో నైపుణ్యం సాధించిన యువ నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు సునీల్ రెడ్డి, రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా కార్యదర్శి రుద్రరాజు నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో భారతీయ జనతా యువమోర్చా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధి నల్లా పవన్, మాజీ శాసనసభ్యులు వేమా జీ, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.