బిఎస్ఎన్ఎల్ 4g ప్రాజెక్టుకు భూములు ఇచ్చినటువంటి ఆదివాసులకు న్యాయం చేయాలి
చింతూరు డివిజన్ ఆదివాసి జేఏసీ చైర్మన్ జలి నరేష్ డిమాండ్
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూలై 18 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు డివిజన్లో లో ఆదివాసి జేఏసీ డివిజన్ చైర్మన్ మాట్లాడుతూ విలీన మండలాలు అయిన చింతూరు,వి ఆర్ పురం ,కునవరం,యటపక మండలాల్లో అమాయక ఆదివాసీలను మాయ మాటలు చెప్పి వారి దెగ్గర నుండి అధికారుల ద్వారా భూమి తీసుకుని అట్టి స్థలంలో బి ఎస్ ఎన్ ఎల్ 4జి టవర్ ని నిర్మించారు.. మీరూ స్థలం ఇచ్చినందుకు గాను మీకు బి ఎస్ ఎన్ ఎల్ లో కేర్ టేకేర్(వాచ్ మెన్) జాబ్ ఇస్తాను అని నెలకు సుమారు 2000 రూపాయలు జీతం ఇస్తాము అమీ నమ్మబలికి అట్టి కేర్ టెకర్ జాబ్ కి నాన్ ట్రైబ్స్ ని ప్రాజెక్టు ఇంజనీర్ కి సంబంధించిన వాళ్ళను 10 టవర్స్ కి పైన నియమించారు అని ఆదివాసీ జె ఏ సి దృష్టికి తీసుకురావడం జరిగింది..కావున బి ఎస్ ఎన్ ఎల్ అధికారులు స్పందించి భూములు ఇచ్చిన ఆదివాసీలకు అట్టి కేర్ టెకర్ జాబ్ ని ఆదివాసీలకు ఇవ్వాలి అని , లేకుంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ను ముట్టడిస్తామని లేదు అంటే మేము న్యాయపోరాటం చెయ్యడానికి సిద్ధం గా ఉన్నాము అని హెచ్చరిస్తున్నాముఅన్నారు