పయనించే సూర్యుడు జూలై 21 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
సూళ్లూరుపేట లో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించి పూజలు చేశారు .ఆలయం వద్ద ఆమె కు ఆలయ సహాయక కమీషనర్ ప్రసన్న లక్ష్మి స్వాగతం పలికారు ,అనంతరం మంత్రి సంధ్యారాణి ఆలయం లోని పరివార దేవతలను దర్శించున్న అనంతరం ,సంధ్యా సమయం లో అమ్మణ్ణికి జరిగే ప్రత్యేక హారతుల కార్యక్రమం లో పాల్గొని చెంగాళమ్మ ను దర్శించుకున్నారు, మంత్రి వెంట MLA నెలవల విజయశ్రీ ,మాజీ MLA నెలవల సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు, పూజలు అనంతరం ఆస్థాన మండపం లో మంత్రికి EO చేతులు మీదుగా ఆలయ మర్యాదలు అందించారు, సూళ్లూరుపేట నియోజకవర్గం లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి MLA నెలవల విజయశ్రీ తో కలిసి వచ్చి చెంగాళమ్మ ను దర్శించుకోవడం జరిగింది, ఈ కార్యక్రమం లో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ,కార్యదర్శి AG కిషోర్ ,బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్,టీడీపీ నేతలు అలవల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.