ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
పయనించే సూర్యుడి న్యూస్: ఫిబ్రవరి 1, పెనుగొండ - పశ్చిమగోదావరి జిల్లా రిపోర్టర్ అక్షింత్ : పెనుగొండ: వాసవి శాంతి ధామ్ లో మెడిటేషన్ (యోగ) సెంటర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ కార్యక్రమం చేశారు. వేద పండితుల ఆశీర్వచనంతో దృశ్యాలువాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ వాసవి మాత శాంతి ధామ్ ట్రస్ట్ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమ్మవారికి నేడు పట్టు వస్త్రాలను సమర్పించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు. వైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, రానున్న కాలంలో ఈ దేవాలయం ఇంకా ప్రసిద్ధి చెందుతుందన్నారు. ఆర్యవైశ్యుల స్త్రీల ఆత్మగౌరవని చాటి చెప్పిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీర్వాదాలు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని అహింసకు, ధర్మనీతికి ,శాంతి, సంపదలకు ,రక్షణకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా లభిస్తున్నాయన్నారు. దేశం మొత్తంలో వైశ్యులు పూజించే ఏకైక అమ్మవారు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు అని చెప్పారు. 2006 సంవత్సరాల క్రితం అమ్మవారి చరిత్రను భక్తులకు తెలియపరిచారు. వైశ్యులు వ్యాపారాలు చేసి, ఉన్న దానిలో పొదుపు చేసుకునే గొప్ప వ్యక్తులుగా ఆనాటి నుండే పేరు గడించారన్నారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు నిండుగా కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటి నీటిపారుదల జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్, ఏపీ ఐ ఐ సి చైర్మన్ మంతెన రామరాజు , ఏపీ ఏ ఎస్ సిపిసి చైర్మన్ పీతల సుజాత, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆచంట నియోజకవర్గం శాసనసభ్యులు పితాని సత్యనారాయణ , జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీ రామరాజ గోపాల్, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ కె సుబ్బారావు, జిల్లా దేవాదాయశాఖ అధికారి ఈ వీ సుబ్బారావు, వాసవి అమ్మవారి శాంతి ధామ్ అధ్యక్షులు పి,ఎన్ గోవిందరాజు, కార్యదర్శి కె ఆర్ కృష్ణ, సెక్రటరీ కోట్ల రాజా, మాజీ ఎమ్మెల్యేలు అంబికా కృష్ణ, బంగారు ఉషారాణి, బండారు మాధవ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పెద్ద ఎత్తున ఆర్య వైశ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.