
:పయనించే సూర్యుడు జులై8 మక్తల్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామ గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ మారెమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించారు.అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు.మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి.ని శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ రవికుమార్, కాంగ్రెస్ నాయకులు వాకిటి హన్మంతు, వాకిటి శ్యామ్, ఆలయ కమిటీ సభ్యులు టప్ప కృష్ణ, బసంత్ సింగ్, వెంకట్ రెడ్డి, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.