పయనించే సూర్యుడు న్యూస్ మే 14 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి
సబికుల్ని ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
అరుణోదయ యాబై వసంతాల ఆడియో సిడి ఆవిష్కరణ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుండి విచ్చేసిన ఉద్యమకారులు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ఏసీఎఫ్)1974 మే,12 న ఏర్పడి నేటికీ యాబై వసంతాలు పరిపూర్తి చేసుకున్న సందర్భంగా 2025 మే, పన్నెండు న సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన స్ఫూర్తి సభ విజయవంతమైంది. ఇటీవల కాలంలో అకాల మరణం పొందిన సాహిత్య వేత్త,పరిశోధకుడు అరుణోదయ మిత్రుడైన కామ్రేడ్: ముత్యం స్మారక హాల్, ఎస్వీకే లో జరిగిన సభకు ముందు సుందరయ్య పార్క్ నుండి వి ఎస్ టి హాల్ వరకు వందలాది మందితో కళా ప్రదర్శన సాగింది. అరుణోదయ జెండాలు ధరించిన కళాకారులు ఎర్ర చీరలతో, దోతులుకట్టి, గొంగళ్లను భుజాన వేసుకొని చేతిలో జెండాలు పట్టుకొని, నృత్యాలు చేస్తూ, సాంప్రదాయ కళాకారులు వెంటరాగా అత్యంత ఉత్సాహంగా సాగింది. అనంతరం ఖమ్మం జిల్లాకు చెందిన అరుణోదయ సీనియర్ కళాకారుడు, అరుణోదయ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్: రాములు అరుణోదయ జెండాను ఎగరవేశాడు. అమరుల స్తూపం చుట్టూ బారులు తీరిన కళాకారులు ఎర్రజెండాకు, అమరవీరులకు లాల్ సలాములు చెబుతూ విప్లవ గీతాలు ఆలపించారు. తమ్మారెడ్డి భరద్వాజ, దివి కుమార్, ఏకే ప్రభాకర్, ఎనిశెట్టి శంకర్, కొల్లాపురం విమల, భుజంగరావు, ప్రొఫెసర్ లక్ష్మి, అంబిక,అనిత,మల్సూర్,రాకేష్, జీవన్ కుమార్,కట్టా భగవంత రెడ్డి, విరసం వరలక్ష్మి, పవన్, సంతోష్, డప్పు భాస్కర్ లు తదితరులు వేదికపై నుండి సభకు అభివాదం చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎం సి యాప్ రెండు తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు: కామ్రేడ్ విమలక్క సభకు సభాధ్యక్షురాలుగా వవహరించడం జరిగింది. అరుణోదయ, పి డి ఎస్ యు పి ఓ డబ్ల్యు మూడు విప్లవ ప్రజాసంఘాలకు యాబై ఏళ్లు నిండిన సందర్భంగా అరుణోదయ ఆడియో, వీడియో పాటను రూపొందించగా కామ్రేడ్ అంబిక పాటను ఆవిష్కరించడం జరిగింది. అరుణోదయకు యాబై ఏళ్లు నిండిన సందర్భంగా సావనీర్ పుస్తకాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ముద్రించగా అట్టి పుస్తకాన్ని ఎనిశెట్టి శంకర్ ఆవిష్కరించడం జరిగింది.తమ్మారెడ్డి భరద్వాజ సినీ దర్శక, నిర్మాత మాట్లాడుతూ. యాబై సంవత్సరాలు పూర్తి చేసుకున్న అరుణోదయకు ముందుగా అభినందనలు తెలిపారు. అరుణోదయ తన శయసాధనలో మరింత శక్తిని పొందుకొని ముందుకు కదిలి సాగాలన్నారు.దివి కుమార్ జన సాహితి అధ్యక్షులు మాట్లాడుతూ… నక్సల్బరి ఉద్యమం నుండి శ్రీకాకుళం, గోదావరిలోయ ఉద్యమాల ప్రేరణతో అరుణోదయ సంస్థ 1974 లో ఆవిర్భవించడం జరిగిందన్నారు. సాంస్కృతిక రంగంలో జీవితకాలం కృషి చేసిన వారు ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలు ముందుకు సాగాలన్నారు యాబై ఏళ్ల సాంస్కృతిక ఉద్యమం అనేక అనుభవాలనుంచిందన్నారు. ఫాసిజంపై పోరాడాల్సినటువంటి అవసరం నేడు ఎంతైనా ఉందన్నారు. ఈ క్రమంలో అందరం కలిసి ముందుకు సాగాలన్నారు.జీవన్ కుమార్ మానవ హక్కుల వేదిక మాట్లాడుతూ.. పాట ప్రజలది, కష్టజీవులదన్నారు. అరుణోదయ పాటను ప్రజల నుండి సేకరించిందన్నారు. అందులో రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను చొప్పించి మళ్లీ ప్రజల దగ్గరకు పాట రూపంలో అరుణోదయ తీసుకెళ్లిందన్నారు. పాట సమాజాన్ని చాలా ప్రభావితం చేసిందన్నారు.రైతుల గురించి, స్త్రీల గురించి, పీడిత ప్రజల గురించి అనేక పాటలను అరుణోదయ ముందుకు తీసుకు వచ్చిందని ఈ సందర్భంగా కొనియాడారుఅరుణోదయ తన కృషి ఇంకా ముందుకు కొనసాగించాల్సి ఉందని అన్నారు. మనమందరం సంస్థకు అండగా ఉండాలని, పాటను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడానికి పరిశోధనలు జరగాలని అన్నారు. ప్రొఫెసర్// కొండా నాగేశ్వరావు మాట్లాడుతూ… యాబై ఏళ్ల కాలంలో అరుణోదయ ప్రజల పక్షాన పోరాటం చేసిందన్నారు. ఈ క్రమంలో అనేక అడ్డంకులు,నిర్బంధాలను ఎదుర్కొన్నదన్నారు. ప్రజా ఉద్యమాలలో అరుణోదయ ఉందన్నారు. అరుణోదయ తన మాటను, పాటను ప్రజలకు అంకితం చేసిందన్నారు. అరుణోదయ ప్రజా సాంస్కృతి ఉద్యమాన్ని తన భుజాలపై మోసి ఉపా కేసులను ఎదుర్కొందన్నారు. పాలకులు కగార్ పేరు మీద ప్రజల పైన యుద్ధం చేయడం సరైనది కాదన్నారు. అంటరానితనం, కుల నిర్మూలన పోరాటాలు, బహుజన బతుకమ్మ బతుకమ్మ లాంటి ఎన్నో కార్యక్రమాలను అరుణోదయ ముందుకు తీసుకొని వెళ్ళింది అన్నారు. పాట ద్వారానే రాజకీయ, ఆర్థిక, సామాజిక, అంశాలను ప్రజలకు సులభంగా అర్థం చేయించగలరని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కృషిని విమలక్క బలంగా చేస్తుందని తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. సాంస్కృతిక ఉద్యమంలో ప్రజల కోసం ప్రాణాలర్పించిన కళాకారులు ఎందరో ఉన్నారని వారందరికీ జోహార్లు అర్పించారు. నేడు పాటలపై, మాటలపై నిర్బంధం కొనసాగుతుందన్నారు యాబై ఏళ్ల ప్రస్థానం చిన్న విషయం కాదన్నారు. ఎన్నో ఆలోచనలు, అనుభవాలను, ఆటంకాలను, దాడులను సమీక్షించుకొని మరింత శక్తితో ప్రజల కలలు నెరవేర్చేందుకై ముందుకు సాగాలని,దోపిడీ,పీడనలను ఎదిరించడానికి ప్రజా సంస్కృతిని నిర్మాణాన్ని పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు ఎనిశెట్టి శంకర్ మాట్లాడుతూ…
1970 దశకంలో ఏర్పడిన అరుణోదయ సమాజంలో ఉన్న దోపిడీ, పీడలకు వ్యతిరేకంగా పని చేస్తుందన్నారు. అరుణోదయ పీడతుల పక్షాన నిలబడిందన్నారు. కుల పోరాటాలు,పర్యావరణ, బహుజన బతుకమ్మ, స్త్రీల సమస్యలను అరుణోదయ ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో.. రమేష్ పోతుల, ఏపూరి మల్సుర్, రాకేష్, అనిత అరుణోదయ, ప్రొఫెసర్ కాసిం సార్, మోత్కూరు శ్రీనివాస్, అరుణపి ఓ డబ్ల్యు స్త్రీ విముక్తి మ, పట్లోళ్ల నాగిరెడ్డి ఆర్ సి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు, సుజ్ఞానమ్మ, సుధాకర్ ఎపి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , రాము పవర్ ముంబాయి బిఎస్ రాములు, ప్రొఫెసర్ లక్ష్మి, కాకి భాస్కర్, విరసం వరలక్ష్మి, జిలుకర శ్రీనివాస్, ఓయూ జేఏసీ నేత దరువు అంజన్న,కోలార్ శాంతమ్మ కర్ణాటక, రాయలసీమ కళావేదిక వెంకటసుబ్బయ్య, సుంకులు ఏ పి ఆర్ సి ఎస్, ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్, ఆంధ్ర ప్రదేశ్ ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు కరీం భాష, ఎం పి పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు సతీష్, విశాఖ అరుణోదయ నాయకులు మస్తాన్, డప్పు భాస్కర్ వస్తాది బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత , ప్రజా కళామండలి సత్తన్న, అరుణోదయ విజయ్, గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్యం, తదితరులు పాల్గొన్నారు