
షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
గంట్లవెల్లి లో సర్పంచ్ చక్కటి శివకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలో లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాలకు మంగళవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఐదువేలకు పైగా ఇండ్లు మొదటి విడత పూర్తి చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే 1978 నుంచి ఇప్పటివరకు నిరుపేదలకు సొంత గృహాలు నిర్మించి ఇచ్చిన ఘనతను సాధించిందని ఆయన వెల్లడించారు. సొంతింటి కల నిరుపేదలకు అంత తేలికగా నెరవేరదని, అందుకే అలాంటి వారిపై ప్రభుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బన్సీలాల్, మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు గౌడ్, దంగు శ్రీనివాస్, సెక్రటరీ సరిత, ఉపసర్పంచ్ మిద్దె మౌనిక, మాజీ సర్పంచ్ ఎంపీటీసీ సిద్ధార్థ, చక్కటి వెంకటేష్ యాదవ్, కె యాదయ్య, యాదమ్మ, వార్డ్ మెంబర్స్ మిద్దె నర్సింలు, సలావుద్దీన్, కె నర్సింలు, మిద్దె సంతోష తదితరులు పాల్గొన్నారు.
