పయనించేసూర్యుడు మార్చి 1 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలంలో పలు గ్రామాలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తలపెట్టిన వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వివిధ రకాల శాఖల ప్రభుత్వ అధికారులతో కలిసి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో వృద్ధులకు, తువులకు,వికలాంగులకు,పెన్షన్ క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు అందుతుందంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క సమర్థతతో పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు జనసేన, కూటమి శ్రేణులు స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు.