
పయనించే సూర్యుడు జనవరి 21 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
అర్హులైన జర్నలిస్ట్ లకు తాను అండగా ఉంటానని రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ అన్నారు.బుధవారం నంద్యాల చాబోలు రోడ్డులోని జర్నలిస్ట్ కాలనీలో సీనియర్ జర్నలిస్ట్ ఎస్ ఆర్ షరీఫ్ కుమారుడు వివాహ కార్యక్రమంకు మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిస్ట్ కాలనీలో సమస్యలు మంత్రి అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం జర్నలిష్టుల సంక్షేమ, అభివృద్ధికి కృషి చేస్తుందని, నంద్యాలలలో తాను జర్నలిస్ట్ సంక్షేమం కోసం మొదటి నుంచి పనిచేస్తున్నానని, చాబోలు రోడ్డులోని విలేకరుల కాలనీలో సమస్యలు పరిష్కరిస్తానన్నారు. మంత్రి ఫరూక్ వెంట నేషనల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్. ఇంతియాజ్ అహమ్మద్, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఇలియాస్, సీనియర్ జర్నలిస్టులు ముస్తఫా, ఉస్మాన్ బాషా, ఎస్ ఆర్ షరీఫ్, యం. వి. రమణారెడ్డి, చింతలపల్లి వాసు, తదితరులు పాల్గొన్నారు.
