పయనించే సూర్యుడు ఫిబ్రవరి 04( మేడ్చల్ నియోజకవర్గం ప్రతినిధి మాధవరెడ్డి)
గ్రామ పంచాయతీలో తప్పుడు ముద్రణలు సృష్టించి అక్రమ బిల్లులను ఆమోదించేందుకు యత్నించిన విషయం వెలుగులోకి వచ్చిన సందర్భంగా,ఆఅవినీతిని అడ్డుకోవడానికి న్యాయపరంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి బి నారాయణ రెండు ఇంక్రిమెంట్లు కట్ చేసి సంవత్సరం ప్రమోషన్ పొందకుండా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయగా లోకాయుక్త కోర్టు ఫైనల్ ఆర్డర్ జారీ చేసింది
ఈ విజయం సాధించిన న్యాయవాది మనసార అభినందిస్తున్నాము.
అవినీతిని అడ్డుకోవడమే కాక, సంబంధిత అక్రమాలు జరిగిన తీరును అధికారులకు, సంబంధిత న్యాయ సంస్థలకు నివేదించి, గ్రామాభివృద్ధి నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో మణికంఠ న్యాయవాది కీలక పాత్ర పోషించారు. ప్రజాస్వామ్యంలో న్యాయం, నిజాయితీ గెలవాలని కృతనిశ్చయంతో ఉన్న ఆయన చర్యలు, ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి