పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
అక్రమ నిర్మాణం పై జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన స్థానికుడు బొట్టు విష్ణు
జిహెచ్ఎంసి కూకట్ పల్లి సర్కిల్ ఎలాంటి అనుమతులు లేకుండా చేపడుతున్న భవన నిర్మాణంపై బుధవారం స్థానికుడు బొట్టు విష్ణు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని దయార్ గూడ 5- 6- 74 లో తక్కువ స్థలంలో ఆకాశాన్నంటే రీతిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, తద్వారా ట్రాఫిక్, తాగునీటి, డ్రైనేజీ సమస్యలు ఏర్పడుతున్నాయని కమిషనర్ కు తెలియజేశారు. వెంటనే సదరు నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు.అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. జిహెచ్ఎంసి అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పండుతుందని అన్నారు.