అబ్బా అబ్బా అబ్బా ఒకటే పలకరింపులు..
▪️ సర్పంచులకు పోటీ చేసే ఆశావాదులు..
పయనించే సూర్యుడు// జనవరి 13 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్…
సర్పంచ్ ఎన్నికలు మొదలే కాలేదు.. కానీ చాలా ఊహల్లో తేలిపోతున్నారు.. కొంత మంది ఆశావాదులు… నేను సర్పంచ్ అంటే నేను సర్పంచ్ అనుకుంటున్నారు.. ఇక పక్కన ఉన్న వారి సంగతి చెప్పనవసరం లేదు ఇక.. నువ్వు సర్పంచ్ వి అయినావు అన్నా,, అంటే చాలు వాళ్ళ ఊహలకు అంతే లేదు … ఇప్పటినుండే పార్టీలు దావతులు నడుస్తున్నాయి , గ్రామాల్లో.. సర్పంచ్ అంటే ఇప్పుడు ఇంటికి ఒకరు పోటీ చేసే పరిస్థితి వచ్చింది.. ఇక నైట్ అయితే చాలు దావతులు.. ముచ్చట్లు, మందు సీసాలు చికెన్ ముక్కలు, యాట దావతులు,ఇక కొంతమంది అయితే సర్పంచ్ అయినట్టే.. కలలు కంటున్నారు.. ఇక సర్పంచిగా పోటీ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే.. అసలు ఎవరినీ ఏ రోజు కూడా మాట్లాడని వారు.. ఇప్పుడైతే అవ్వ బాగున్నావా.. బాపు బాగున్నావా ఆరోగ్యం బాగుందా..అని పలకరింపులు మొదలయ్యాయి.. ఇంటి సభ్యుల వలే పలకరింపులు చాలా బాగున్నాయి.. ఒకసారి కూడా వాళ్ళ పక్క నుంచి పోతే చూడని వ్యక్తులు కూడా.. మరీ బండ్లు ఆపుకొని పలకరిస్తున్నారు.. ఏ ఇక గ్రామాల ల్లో అయితే అక్కడక్కడ కూర్చునే (అడ్డా )పెద్దమనుషులు ఏ ఒకటే ముచ్చట్లు.. టిఆర్ఎస్ అంటే ఒకరు కాంగ్రెస్ అంటే మరొకరు, ఏ కాదు కాదు బిజెపి అని మరొకరు…ఇతను ఈ పార్టీ నుండి పోటీ చేస్తాడు, అతను ఆ పార్టీ నుండి పోటీ చేస్తారని ఒకటే ముచ్చట్లు.. ఎలాగైతేనేం గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్ అయితే, గ్రామ అభివృద్ధి కోసం గొప్ప సంకల్పంతో పని చేసే మంచి నాయకుడైతే సరిపాయె.. ఎలాగైతే నేమి.. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు కొంతమంది.. కాలర్ ఎగరేసి జేబులో చేయి పెట్టే నాయకుడు కాదు.. ప్రజా సమస్యలు గ్రామంలో ఏమైనా ఉంటే గ్రామం దాటకుండా చూసుకునే నాయకుడు అయితే, చాలు అని..చాలా మంచిదని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం.