
బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక శుభ్రత పనులు
పయనించే సూర్యుడు,సెప్టెంబర్ 19,అశ్వాపురం: సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమంలో భాగంగా శనివారం అశ్వాపురం గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. అశ్వాపురం పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ సిబ్బంది బహిరంగ ప్రదేశాలు శుభ్రత పనులు నిర్వహించారు. పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించి ఆయా ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు సదర్ లాల్ మాట్లాడుతూ.. గ్రామంలో నిరంతరం శుభ్రతను పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని, తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలతో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత కార్యక్రమాలు విజయవంతమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ రావు పంచాయతీ కార్యదర్శి యాకూబ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.