
అధ్యక్షత వహించిన సర్పంచ్ సదర్ లాల్
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 5, అశ్వాపురం: ఈ రోజు అశ్వాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన గ్రామసభను విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ స్థాయి అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, స్కూల్ హెచ్ఎంలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, రెవెన్యూ అధికారులు తదితరులు హాజరై గ్రామాభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ గ్రామసభలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఇరవై ఒక్క మంది పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లు పంపిణీ చేశారు. అలాగే గ్రామంలో అమలు చేయాల్సిన పలు అభివృద్ధి పనులు సీ.సీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రతి వీధి వీధినా చెత్త మరియు ముళ్ళకంపా, పిచ్చి మొక్కల తొలగింపు మొదలగు కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా వీధుల్లో విద్యుత్ స్తంభాలు లేని ప్రాంతాలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.అదేవిధంగా గ్రామపంచాయితీ బిల్డింగ్ నిర్మాణ స్థలం గురించి, గ్రామంలోని డ్రైనేజ్ సమస్యలపై గ్రామ పంచాయతీ అధికారులతో కలిసి చర్చించి, బజార్ ప్రాంతాలు సహా పలు వీధుల్లో ఉన్న డ్రైనేజ్ ఇష్యూలను పరిష్కరించాల్సిన అవసరాన్ని సభ్యులు ప్రస్తావించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ రావు గ్రామపంచాయతీ సెక్రటరీ గారు శ్రీ దాసరి మల్లేశం, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పి.వెంకటేశ్వరావు,ఫారెస్ట్ ఆఫీసర్ ధనలక్ష్మి, వ్యవసాయ శాఖ ఏఈఓ డి.రమాదేవి,వార్డు సభ్యులు వేములపల్లి హసిత, కోర్సా ముత్తమ్మ, నూకలలింగయ్య, చింతల అనుపమ,చిక్క పద్మ, బానోతు పద్మ,చెట్టుపల్లి కుమారి, ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మణ్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
