
పయనించే సూర్యుడు,జనవరి26,అశ్వాపురం:
77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అశ్వాపురం గ్రామపంచాయతీలో జాతీయ జెండాను అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఎగురవేశారు మరియు గ్రామ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మన పెద్దలు జాతీయ నాయకులు ఎంతో త్యాగం చేశారని. ఈరోజు మన రాజ్యాంగం అమలులో వచ్చిన రోజు ప్రతి వ్యక్తి సేవాభావం కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఉపసర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు. గ్రామపంచాయతీ కార్యదర్శి మల్లేష్, చిక్క పద్మ, అనిల్ కుమార్ సవలం, లింగయ్య నూకల,అనసూయ కుర్సం, వేములపల్లి ఆశ్రిత,గుర్రం త్రివేణి,జరపలా కౌసల్య, ధనలక్ష్మి కనతాలా,రమాదేవి నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ గ్రామసభను నిర్వహించారు, గ్రామ పెద్దలు ఇతరులు పాల్గొన్నారు.