తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం..
రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లను అసలైన నిరుపేదలను గుర్తించి వారికి కేటాయించాలని బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ శనివారం రుద్రూర్ మండల తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, కటికే రామ్ రాజ్ లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్మించిన బెడ్ రూమ్ ఇండ్లను అసలు ఇండ్లు లేని లబ్దిదరులను గుర్తించి వారికీ మాత్రమే ఇవ్వాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకి రుద్రూర్ గ్రామంలో మురికి కాలువలు కబ్జాలకి గురి అయ్యి వర్షపు నీరు ఇండ్లలోకి రావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కావున తహసీల్దార్ ఈ విషయాల పట్ల ఒక వారం రోజులలో రుద్రూర్ గ్రామ పంచాయితీలో గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజలు పడుతున్న కష్టాలను మీరే ప్రతక్షంగా తెలుసుకొని వాటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించి, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రుద్రూర్ గ్రామంలో మిరే చొరువ తీసుకోని అసలైన నిరుపేద లబ్దిదారులను గుర్తించి లిస్ట్ తయారు చేసి రుద్రూర్ గ్రామపంచాయతీ వద్ద అందరి సమక్షంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అదేవిధంగా రుద్రూర్ నుండి బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే బ్రిడ్జి పై నుండి వర్షం ఎక్కువ కురిసిన ప్రతి సారి చెరువు అలుగు పారి బొప్పాపూర్ గ్రామ ప్రజలకు రాకపోకలకూ అంతరాయం జరుగుతుందన్నారు. ఈ సమస్యని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నూతన బ్రిడ్జి నిర్మించడానికి కావలసిన ఏర్పాట్లు ప్రభుత్వ అధికారులతో మాట్లాడవలసిందిగా భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల శాఖ తరపున తహసీల్దార్ కు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్లు సున్నం సాయిలు, ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు మార్కెలి ప్రకాష్ పటేల్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, మండల సీనియర్ నాయకులు పార్వతి మురళి తదితరులు పాల్గొన్నారు.