పయనించే సూర్యుడు మార్చి 18 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం గత ఐదు దశాబ్దాల పార్లమెంటు సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణన్న పోరాట ఫలితమే అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, బీసీ సంక్షేమ సంఘం, బీసీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు కూకట్ పల్లి వాస్తవ్యులు తెల్ల హరికృష్ణ తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లు మీద చర్చ జరుగుతున్న సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మీదకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా బీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో కూడా రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ప్రవేశపెట్టారు ఈ తరుణంలో చట్టరూపం దాల్చే వరకు ప్రభుత్వం నియమ నిబద్ధతతో కృషి చేయాలని కోరారు అదే రకంగా బీసీ గురుకులాల బలోపేతం బీసీ సంక్షేమ హాస్టల్లో బలోపేతం కోసం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తామన్నారు రేపు బడ్జెట్లో ఆ రకమైన కేటాయింపులు ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు బీసీ విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నాణ్యమైన కోచింగ్ అందించి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని బీసీ లీడర్ తెల్ల హరికృష్ణ తెలిపారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు మెస్ బకాయిలకు రేపు బడ్జెట్లో నిధులు కేటాయించి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు.