,మే 14 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మురికి కాలువలు చెత్త చెదారంతో నిండిపోయి అస్తవ్యస్థంగా మారాయి. గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని, మురికి కాలువల్లో చెత్త చెదారంతో పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.