పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 16//మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ మండల గోలపల్లి ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజంలో ఉన్న వివిధ వృత్తుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇంజనీర్ తన భవన నిర్మాణం నైపుణ్యాలను, వైద్యుడు తన వృత్తి ధర్మాన్ని,సైనికుడు దేశ భద్రతలను పరిరక్షించే విధంగా ఏర్పాటు చేశారు. సందర్బంగా హెచ్ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ రకరకాల వృత్తుల ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో నిత్య జీవన నైపుణ్యాలను పెంపొండుతాయని, వృతి పట్ల గౌరవం, వృతి విలువ తెలుస్తుందని తెలిపారు. ఈ ప్రదర్శనకు కృషి చేసిన శ్రీకాంత్,ఇందిరా ఉపాధ్యాయ బృందానికి విద్యార్థులు అభినందించారు.