పయనించే సూర్యడు న్యూస్ టెక్కలి పతినిధి ఫిబ్రవరి 01
టెక్కలిలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు ఆకలి తీరుస్తున్న అభయం ఫుడ్ బ్యాంక్ స్థాపించి నేటికి 900 రోజులు పూర్తి చేసుకుందని అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈరోజు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పట్నాన శ్రావణ్ కుమార్ దంపతులు అన్నదానం చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు. ఈ ఫుడ్ బ్యాంక్ దాతల సహకారం తో ప్రతిరోజు రెండు పూటలు 50 నుంచి 60 మందికి అన్నదానం చేస్తున్నామని, ఈ 900 రోజుల అన్నదానం కు దాతల సహకారంతో సుమారు 21 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు ఆయన తెలియజేసారు. మరి కొంతమంది దాతలు ముందుకు వస్తే ఎటువంటి ఆసరా లేని వృద్ధులకు, ఇంటి వద్దకే అన్నం పాకెట్స్ పంపించే కార్యక్రమం ను చేయవచ్చని ఆయన అన్నదాతలకు ఆహ్వానం పలికారు. అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు 9441116108 నెంబర్ కు సంప్రదించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాస రావు, సంఘ సభ్యులు ధర్మవరపు పూర్ణాచారి, కంచరాన రాజు పాల్గొన్నారు.