
పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 ప్రతినిధి. గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం
గెద్దనపల్లి,కోప్పిగుంట గ్రామ పంచాయతీలను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు,పంచాయతీలకు సంబందించిన పలు రికార్డులను తనిఖీ చేశారు.ఆయా స్వర్ణ గ్రామ సచివాలయం సిబ్బంది విధిగా సమయ పాలన పాటించాలని,ప్రజనీకానికి నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు,పారిశుధ్యం,మంచినీరు మరియు వీధిదీపాలు వంటి మౌళిక అంశాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారులతో సమన్వయం చేసుకొని ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు,విధుల నిర్వాహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.సదరు సందర్శనలో డిప్యూటీ ఎంపీడీఓలు శంకర్ నారాయణ సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు
