
పయనించే సూర్యుడు కడప టి.సుండుపల్లె, ఫిబ్రవరి 5
రాయవరం గ్రామం, మాచిరెడ్డి గారి పల్లి పంచాయితీ తొగురుపల్లి గ్రామంలో ప్రధాన రోడ్డు ఆక్రమణ వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన పోలిశెట్టి యర్రయ్య కుటుంబ సభ్యులు సుమారు 15–20 అడుగుల మేర ప్రధాన రోడ్డును ఆక్రమించి, ఇటీవల సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా రాతి కూశాలు నాటారని గ్రామస్తులు తెలిపారు. అలాగే మట్టి రోడ్డును కుదించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు.ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ క్లినిక్‌లో సబ్ కలెక్టర్ భావన, ఎమ్మార్వో మహబూబ్ చాంద్‌లకు గ్రామ ప్రజలు వినతిపత్రం అందజేశారు. రోడ్డు అక్రమణకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
