పయనించే సూర్యుడు మే 9 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో ఆత్మకూరు పట్టణంలోని ఓబుల్ రెడ్డి నగర్ లో ఆక్రమిత పంట కాలవలను పరిశీలించిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆత్మకూరు పట్టణంలోని స్పార్క్ సిటీ వెనుకవైపున ఉన్న ఓబుల్ రెడ్డి నగర్ కాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా మొత్తం ఎనిమిది సర్వే నెంబర్లలో 20 ఎకరాలలో 4 లేఔట్లను ఏర్పాటు చేశారు. ఈ అనుమతినేని అక్రమ లేఅవుట్లలో మున్సిపాలిటీ, హూడా. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలలో ఏ ఒక్కటి నుండి కూడా అనుమతులు లేకుండా ఈ లేఅవుట్లు వేసి ఉన్నారు. వ్యవసాయ భూములలో లేఔట్లు వేయడం వల్ల పంట కాలువలు కూడా ఈ లేఅవుట్ల లలో కలుపుకొని పూడ్చి వేయడంతో ఆత్మకూరు తో పాటు వెంకట్రావుపల్లి, నర్సాపురం తదితర గ్రామాలలో పంటల సాగుకు నీటి ప్రవాహానికి ఇబ్బంది ఏర్పడి రైతులకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. తమ పంట కాలువను ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్నారని ఈ ప్రాంత రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించుకుని ఉన్నారు. దీనిపై వీరికి మద్దతుగా సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ నేత పందిరి సుబ్బయ్య, ఆత్మకూరు ప్రాంత నేత దీపోగు బాబు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో నేడు రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు కాలవల హద్దులు నిర్ణయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంట కాలువలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు హద్దులు నిర్ణయిస్తూ కర్రలను నాటారు.మరో రెండు రోజులపాటు పూర్తి సర్వే జరిపి నివేదికను జిల్లా అధికారులకు సమర్పిస్తామని ఇరిగేషన్ ఏఈ రవికుమార్ రెడ్డి తెలిపారు.రైతాంగ సమస్య కావడంతో మద్దతుగా జిల్లా రైతు సంఘం నేత లక్కు ప్రసాద్ కూడా ఈ సర్వే లో పాల్గొన్నారు. పంట కాలవలు ఆక్రమణ పై ఫిర్యాదు ఇచ్చిన దీపోగు బాబు తో పాటు ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వేయర్, ఆర్ఐ, వీఆర్వో సిబ్బంది పాల్గొన్నారు..