కొరమీను ద్వారా అధిక లాభాలు ఎంపీడీవో రవీందర్రావు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆలోచనల మేరకు జిల్లాలో ఉన్న ప్రతి రైతుని వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో అధిక లాభాల వైపు తీసుకువెళ్లాలని సంకల్పంతో తలపెట్టిన కార్యక్రమాలలో మునగ సాగు మరియు కోరమీను చేపల పెంపకం ప్రధానమైనవని
మండలంలోని రైతులు వ్యవసాయాన్ని కనుబద్ధంగా ఉన్న ఆకువ కల్చర్ లో భాగంగా కొరకు చేపలకు పెంపకం చేపట్టినట్లయితే అధిక లాభాలను గడించవచ్చు అని స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి రవీందర్రావు అన్నారు స్థానిక టేకులపల్లి మండలం ఐకెపి కార్యాలయంలో జరిగిన రైతులు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టేకులపల్లి మండలంలోని వ్యవసాయానికి మంచి అనుకూలమైన ప్రాంతమని రైతులు తక్కువ ప్రదేశంలో అనగా నాలుగు కుంటల స్థలంలో సంవత్సరానికి ఖర్చులు పోను రెండు లక్షల పైగా ఆదాయం గటించవచ్చని తద్వారా కుటుంబ వృద్ధి జరిగి ఈ ప్రాంతం కూడా వ్యాపార అవకాశాలకు సెంటర్ గా మారుతుందని అన్నారు. మండలంలో ఇప్పటికే 64 మంది రైతులకు ఫాంపాండ్ నిర్మించడం కోసం ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేయడం జరిగిందని పనులన్నీ పూర్తి దశలో ఉన్నాయని తెలియజేశారు బోరు కరెంటు సౌకర్యం ఉన్న ప్రతి రైతు పామ్ పౌండ్ నిర్మించుకొని కొరమీను చేపల పెంపకం చేయవచ్చని అన్నారు. చేపల పెంపకం ద్వారా విడుదల అయ్యే నీరును వ్యవసాయానికి ఉపయోగించుకోవడం ద్వారా పంటలకు నత్రజని మంచిగా దొరికి అధిక సాగు దిగుబడులు వస్తాయని అన్నారు మండలంలోని భూమి మంచి సారవంతంగా ఉంటుందని అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉండి కొరమీను చేపల పెంపకం కోసం కూడా మంచి భూములు ఉన్నాయని కొరమీను చేపల పెంచడం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తులు పరిశీలిస్తామని అర్హులైన అందరికీ బ్యాంకు ద్వారా ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా బ్యాంకు కి అనుసంధానం చేసి రాయితీ మంజూరు చేపిస్తామని స్థానిక ఎపిఎం రవికుమార్ రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిపిఎం వెంకయ్య మాట్లాడుతూ సాంకేతిపరంగా మరియు బ్యాంకులను అనుసంధానం చేయుటకు జిల్లా నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉదయ్ ఆక్వా సిస్టమ్స్ టెక్నికల్ అడ్వైజర్ విద్య రైతులకు పూర్తి అవగాహన కల్పించారు ఆమె మాట్లాడుతూ షర్టు నిర్మాణానికి పిల్లల పెంచుకోవడానికి ట్యాంకు నిర్మాణానికి పిల్లలకు కావలసిన దాన మరియు ఇతర మందులు ఎలా వేసుకోవాలి రైతులు మంచి ప్రాక్టీస్ ఎలా చేయాలి అనే సందేహాలను అభివృద్ధి చేశారు మండలంలో ఏర్పాటు చేసే ప్రతి రైతుకి ఈ సందేహాలు వచ్చిన ఆహ్వానించి తీర్చుటకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆసక్తి ఉన్న 20 మంది హాజరవుగా రైతులకు ఉన్న ప్రతి సందేహాన్ని ఉదయ్ ఆక్వా సిస్టమ్స్ వారు నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో సిసిలు సునీల్ కుమార్ నరేష్ సావిత్రి శ్రీలత నాగమణి అకౌంటెంట్ సమ్మయ్య రైతులు అశోక్ తదితరులు పాల్గొన్నారు