ప్రతి గూడెంలో, ప్రతి ఇంటిపై ఆదివాసి జెండా ఎగరాలి: ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 29 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చింతూరు డివిజన్ లో మంగళవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో చింతూరు మండల కేంద్రంలోని సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9 పురస్కరించుకొని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు 9 వరకు నవోహోత్సవాల కార్యక్రమం జరుగుతుందని. ఈ నవోత్సవాల కార్యక్రమానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ గత 15 సంవత్సరాల నుండి నిర్వహిస్తుందని, ఈ నవోత్సవాల కార్యక్రమం వలన ప్రభుత్వాలు కూడా స్పందించి నేడు అధికారికంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం చేస్తున్నాయి ఆని అలాగే సోదర ఆదివాసి సంఘాలు కూడా నావోత్సవాల కార్యక్రమాలను ప్రకటించడం ఆదివాసి ఐక్యతకు పునాది అని ఆయన వ్యక్తపరిచారు. హక్కుల సాధన కోసం ఒకటే ఎజెండా గా పనిచేయటం ఆదివాసి సమాజానికి శుభపరిణామం అని ఆయన తెలియజేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం యొక్క ఆవశ్యకత ప్రతి ఆదివాసి కి తెలియాలని ఆదివాసి దినోత్సవం రోజు మాత్రమే కార్యక్రమం చేస్తే చాలామందికి దాని యొక్క ఆవశ్యకత తెలియదని ఆదివాసి సంక్షేమ పరిషత్ నవోత్సవాల కార్యక్రమాన్ని తలపెట్టిందని ఈ కార్యక్రమం నేడు రెండు రాష్ట్రాల్లో కూడా వర్ధిల్లటం సంతోష కరమైన విషయం అని ఆయన అన్నారు. ఆగస్టు 15న ప్రతి ఇంట్లో జాతీయ జెండాను ఎగరవేసినట్లు ఆగస్టు 9న కూడా ప్రతి ఆదివాసి ఇంటిపై ఆదివాసి జెండా ఎగరవేయాలని ఆదివాసులకు పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ రాజ్యాంగ ఫలాలు ఆదివాసులకి అందని ద్రాక్షగానే ఉన్నాయని. ప్రపంచ దేశాలు అన్నీ కలిసి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1994లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆగష్టు 9 ప్రపంచ దేశాలలో అధికారికంగా నిర్వహించాలని గుర్తించడం జరిగిందని అన్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అంతరించిపోతున్న ఆదివాసి జాతుల్ని పరిరక్షించడం, ఆదివాసి హక్కులను సాధించుకోవడం, సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవడం ఆదివాసీల అభివృద్ధికి దోహదపడటం వంటివి ప్రధాన ముఖ్య ఉద్దేశాలు అని ఆయన అన్నారు. భారతదేశంలో ఆదివాసులపై జరుగుతున్న అణిచివేత దోపిడీ వ్యవస్థ పై ఉద్యమించాలని రాజ్యాంగా చట్టాల అమలకై, హక్కుల సాధనకై ప్రతి ఆదివాసి ఉద్యమానికి సిద్ధం అవ్వాలని, ఆదివాసి నవోత్సవాల కార్యక్రమంలో ప్రతి ఆదివాసి భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగ నాయకులు సోడే నారాయణ, ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ కన్వీనర్ జల్లి నరేష్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శీలం తమ్మయ్య, ఎర్రం పేట పూజారి మడివి రాజు , కాక సీతారామయ్య, మడివి సాయి, మడివి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు