పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 5
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చట్టి గ్రామంలో ఆగస్టు 9న అంతర్జాతీయ ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మహోత్సవాలు భాగంగా ఈరోజు చట్టి గ్రామంలో స్థానిక సర్పంచ్ రవ్వ భద్రమ్మ మరియు గ్రామ పూజారి పటేల్ గారిచే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది, అనంతరం డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ చింతూరు డివిజన్లో ఆగస్టు ఒకటో తారీకు మొదలుకొని నవోత్సవాలు భాగంగా ప్రతి ఊర్లో ప్రతి గూడెంలో జెండా ఎగరవేయాలని ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అలాగే మన ఏజెన్సీ ఆదివాసి యువతరం ఇప్పటికైనా మేలుకోకపోతే చాలా ప్రమాదం పొంచి ఉందని ఆయన మాట్లాడటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగస్టు 9 నా అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని రాష్ట్ర పండుగ గుర్తిస్తూ సెలవుదినంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా ఆగస్టు 8 చలో మారేడుమిల్లి ఆదివాసి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, అలాగే ఊర్లలో చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని యువతకి ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది అలాగే పేసా చట్టం 1/70 చట్టం పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఆయన వివరణ ఇచ్చారు నేటి యువతరం ఇప్పటికైనా మేలుకొని బయటికి వచ్చి చట్టాలను తెలుసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఆయన వివరించారు, అలాగే చట్టి గ్రామంలో ఆనాటి పూర్వికులు ఎలా అయితే గ్రామదేవతలను పండగలను ఎలాగైతే పాటల రూపంలో పాడుతారో అలాగే పెద్దవాళ్లు పాటల పాడుతూ డాన్సులు వేయడం జరిగింది కార్యక్రమంలో డివిజన్ చైర్మన్ జల్లి నరేష్, ఉద్యోగ జేఏసీ నాయకులు తిమ్మసాయి, చింతూరు మండల కార్యదర్శి కాక సీతారామయ్య, మండల ఆదివాసి నాయకులు పోడియం లక్ష్మణ్,సర్పంచ్ రవ్వ భద్రమ్మ, మాజీ సర్పంచ్ తుర్రం రామయ్య, గ్రామ పూజారి తుర్రం రాజయ్య, తుర్రం చంద్రయ్య, పెసా కమిటీ కార్యదర్శి పోడియం రామకృష్ణ, తుర్రం రాముడు, తుర్రం రామకోటి, తుర్రం నీల్ రాజు, తులం సీతారామయ్య, మహిళలు, చట్టి యువత తదితరులు పాల్గొన్నారు.