గ్రామీణ యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
( పయనించే సూర్యుడు జనవరి 11 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )
◆ కొందుర్గ్ మండలం కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ & వాలీబాల్అసోసియేషన్ మహా బూబ్ నగర్ వారి ఆధ్వర్యంలో 18వ రాష్ట్ర స్థాయి వాలిబాల్ టోర్నమెంట్ పోటీలను షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ యువతకు సత్సంబంధాలు మెరుగుపర్చలనే ఉద్దేశ్యంతో కొందుర్గ్ మండల ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలిబాల్ పోటీలలో క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరుస్తూ జిల్లా,జాతీయ స్ధాయిలో రాణించాలని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతా యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని, ఏఆటలోనైనా గెలుపు,ఓటమి అనేది సహజం కాని చివరి వరకు పోరాడాలి అన్నారు.ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉండలని అపుడే విజయం మన చెంతకి చేరితుందని అని అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపున్యాభివృద్ది చేసుకొని చదువు ,క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ఇంత పెద్ద ఎత్తున పోటీలను నిర్వహిస్తున్న ప్రవీణ్ ను మాజీ ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో నేతలు,కృష్ణ రెడ్డి, రాజేష్ పటేల్,,యాదయ్య, దామోదర రెడ్డి,రామ కృష్ణ,రాములు గౌడ్,కె కె కృష్ణ, అక్రమ్,ముబారక్ అలీ ఖాన్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.