పయనించే సూర్యుడు ఆగస్టు 8 (ఆత్మకూరు నియోజవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో టీడీపీ గుండాలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నాయకుడు వేల్పుల రాముపై నేతలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో ఓ శాసనమండలి సభ్యుడికి పోలిసుల నుండి కనీస రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి. ఎమ్మెల్సీకి పోలిసులు కనీస భద్రత కూడా కల్పించలేరా, జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ భయాందోళనలకు గురిచేసి గెలవాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వాతంత్య్రాన్ని, ఎన్నికల స్వేచ్చను పొగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. పోలిసులు కేసు నమోదు చేసిన వారిని అరెస్ట్ చేసి విచారించి నిజానిజాలు తేల్చాలన్నారు