పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని రూరల్ రిపోర్టర్
నిరసన కార్యక్రమము స్థానిక ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది నియోజకవర్గ ఏఐటియుసి ఆటో యూనియన్ అధ్యక్షులు వై .టి . భీమేష్ అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమానికి జిల్లా ఏ ఐ టి యు సి అధ్యక్షులు కె అజయ్ రావు మరియు ఏ ఐ టి యు సి పట్టణ ప్రధాన కార్యదర్శి బి వెంకన్న పాల్గొని వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికుల సమస్యల పరిష్కరించాలని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులకు ఆదాయం లేక ఆటో కార్మికుల కుటుంబానికి పోషించడం చాలా ఇబ్బందిగా గురవుతున్నారని తక్షణమే కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు జీవన ఉపాధి కింద నెలకు 5000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 60 వేల రూపాయలు ఇవ్వాలని ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కాంపౌండ్ ఫీజులు పెంచే జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని ప్రవేట్ సంస్థలకు ఇచ్చిన ఫిట్నెస్ డ్రైవింగ్ లైసెన్స్ లో అనుమతులు రద్దుచేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో లైసెన్సులు ఫిట్నెస్ చేయాలని పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రోడ్ టాక్స్ లేబర్ టాక్స్ ఫీజులు తగ్గించాలని వాహన విడిభాగాలు ధరలను 30% తగ్గించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగినది కనుక ఆటో డ్రైవర్ల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని లేనిచో రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాన్ని తీవ్రత ఉధృతం చేస్తామని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు జోసఫ్, ప్రహ్లాద్,అఖిల్, కృష్ణ, మాజీ ఎ ఐ వై ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎం గిరిమలప్ప. ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది.