పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరుడివిజన్ ఇంచార్జ్. అక్టోబర్ 5
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ లో భాగంగా మరో హామీను ఆటో డ్రైవర్ల సేవ పేరుతో శనివారం ఆటో డ్రైవర్ల ఖాతాలో 15వేల రూపాయలను జమ చేయడం జరిగింది. రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ ల ఆధ్వర్యంలో 11 మండలాల నుండి ఆటో క్యాబ్ డ్రైవర్లతో రంపచోడవరం వేదిక కృతజ్ఞత సభ భారీగా జరిగింది. ఈ సభకు చింతూరు మండల పార్టీ అధ్యక్షులు ఎండి జమాల్ ఖాన్ ఆధ్వర్యంలో ఆటో క్యాబ్ డ్రైవర్లు భారీగా హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష దేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారంగా హామీలలో భాగంగా ఆటో డ్రైవర్ల సేవ పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 2,90,234 మంది ఆటో డ్రైవర్లకు 435.36 కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. ఆటో కార్మికులు ఆర్థికంగా సహాయపడేందుకుగాను ప్రతి సంవత్సరం ఈ విధంగా ఆదుకుంటుందని భరోసాతో నిండిన ప్రభుత్వం పై ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి ఉండాలన్నారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ చింతూరు టిడిపి మండల అధ్యక్షులు జమాల్ ఖాన్ ఈ సభకు హాజరై ఎమ్మెల్యే ఐటీడీఏ పీవో సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శుభం నొక్వాల్ ,రంపచోడవరం తెలుగుదేశం నాయకులు, చింతూరు ఆటో యజమానులు, మేచర్ అబ్బు, ఎండి.జవహర్, శివాజీ తదితరులు పాల్గొన్నారు