
పయ నించే సూర్యుడు జూన్ 24 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) పి..4లో భాగంగా నాల్గవ కుటుంబాన్ని దత్తత తీసుకున్న జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ పక్షవాతంతో బాధ పడుతూ గుండె పోటుతో ఈ నెల 19వ తేదీన మృతి చెందారు.ఆయన భార్య సరస్వతి పూర్తి మానసిక దివ్యాంగురాలు.వారికి ముగ్గురు ఆడ బిడ్డలు ఉన్నారు.దాంతో తండ్రికి ఆ ఆడ బిడ్డలే అంత్య క్రియలు నిర్వహించారు. అటువంటి నిరుపేద చేనేత కుటుంబానికి అండగా" నేనున్నాను "అంటూ జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ముందుకు వచ్చారు.ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి..4 పథకంలో భాగంగా ఆయన మూడు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. ముగ్గురు ఆడ బిడ్డలతో పాటు మానసిక దివ్యాంగురాలైన తల్లి పరిస్థితిని స్వయంగా చూసిన ఆయన పి..4లో భాగంగా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టు గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం ప్రకటించారు.వారి కుటుంబానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. అంతేకాకుండా వారి కుటుంబానికి సుమారు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు.దివ్యాంగురాలైన తల్లికి అప్పటికి అప్పుడు ఫ్యాన్ సదుపాయం కల్పించారు.వారికి అవసరమైన వస్త్రాలు అన్ని సమకూర్చనున్నట్టు ప్రకటించారు. ఆ నిరుపేద కుటుంబాన్ని దత్తత తీసుకున్న జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావుకు గ్రామపెద్దలు ములికి విఘ్నేశ్వరుడు,అంకం వీర్రాజు, ఇనుమర్తి రాజు,కోట సత్తిరాజు, కొంకి వెంకట్రావు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఇనుమర్తి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు...