మహిళాలకు మొదటి రోజు చేదు అనుభవం, నిరాశతో మహిళలు
తెలంగాణ అంటేనే బతుకమ్మ
నిధులు లేక బతుకమ్మ ఏర్పాట్లు చేయలేదా
ఎంగిలిపువ్వు బతుకమ్మలో కనపడని ఉత్సాహం
ఆడబిడ్డలను నిరుత్సాహపరిచిన అధికారులు
చిన్న బోయిన ఆడబిడ్డలు
మాటలే తప్ప చేతల్లేవంటూ మండిపాటు
రెండు పంచాయతి కార్యదర్శులు ఏమయ్యారు
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 21(పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి
తెలంగాణ రాష్ట్రం లోని మహిళల గొప్ప పండుగకు అంతులేని నిర్లక్ష్య ధోరణిలో అధికారులు ఉన్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రతి ఏటా బతుకమ్మకు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేసి మహిళను సంతోషంగా ఈ బతుకమ్మ పండుగను నిర్వహించుకునేలా చేసేవారు అని మహిళలు ఆరోపిస్తున్నారు. కానీ ఈ సంవత్సరం మహిళలకు ఆవకాయ గింజంత కూడా బతుకమ్మ ఏర్పాటు చేయలేదని మహిళల ఆరోపించారు.రామాలయ ప్రాంగణంలోని ఇరుకుగా అసౌకర్యంగా ఉన్న ప్రదేశంలో అసంతృప్తితో మహిళలు బతుకమ్మ పండగ నిర్వహించారు. ఎంగిలిపువ్వు బతుకమ్మలో మహిళ ముఖంలో కనపడని ఉత్సాహం, ఆడబిడ్డల నిరాశపర్చిన అధికారులు బాధతో ఎంగిలిపువ్వు బతుకమ్మను మహిళలు నిర్వహించుకున్నారు. నిధులు లేక బతుకమ్మ ఏర్పాట్లు చేయలేదా.? దీనివల్ల ఏర్పాట్లు చేయలేదు దీనికి మండల ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేదా.? బతుకమ్మ అంటే అధికారులకు అవసరం లేదా అనే ప్రశ్నలు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏర్పాట్లు అధికారులకు ఇష్టం లేదా. తెలంగాణ బతుకమ్మ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక పేరు తెచ్చిన పండుగ, ఇలాంటి పండుగకు ఏర్పాట్లు చేయడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకని మహిళలు ప్రశ్నిస్తున్నారు.? ప్రజా పాలనలో బతుకమ్మ ఏర్పాట్లకు భంగం ఏర్పడింది అని అని మహిళల ఆరోపిస్తున్నారు