
మంత్రి సుభాష్‌కు రాఖీ కట్టేందుకు వేలాదిగా తరలివచ్చిన మహిళలు
పయనించు సూర్యుడు ఆగస్టు 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ "అన్నయ్యతో ఒకరోజు" పేరుతో రామచంద్రపురంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలురామచంద్రపురం నియోజవర్గం రూపురేఖలు మారుస్తాకోటిపల్లి- ముక్తేశ్వరం బ్రిడ్జి నిర్మాణం సాధిస్తారాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం, ఆగస్టు 28:అనురాగం, ఆత్మీయత, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను రామచంద్రపురం టౌన్హాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు నియోజక వర్గంలోని వేలాది మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రికి రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు అన్నగా అండగా ఉంటానని, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తానని తెలిపారు. రక్షాబంధన్ కేవలం రాఖీ కట్టే పండుగ మాత్రమే కాదని, అనురాగం, ఆత్మీయత, ఆత్మవిశ్వాసంతో కూడిన బంధాలను మరింత బలోపేతం చేసే పండుగ అని పేర్కొన్నారు.కోటిపల్లి ముక్తేశ్వరం బ్రిడ్జి నిర్మాణం సాధిస్తారామచంద్రపురం నియోజవర్గం అభివృద్ధికి గడచిన రెండేళ్లలో 250 కోట్లు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా ప్రణాళికను సిద్ధం చేశామని వెల్లడించారు. రానున్న కాలంలో కోటిపల్లి ముక్తేశ్వరం బ్రిడ్జి నిర్మాణం సాధించి తీరుతానని మంత్ర ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేయంగా నియోజవర్గ అభివృద్ధికి చిత్త శుద్ధితో పనిచేస్తానన్నారు.మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంమహిళల సంక్షేమానికి, వారి ఆర్థిక పరిపుష్టికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సుభాష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు.ధైర్యం కోల్పోవద్దు.. ఆత్మహత్యలకు పాల్పడవద్దు
ఇటీవల కాలంలో కొంతమంది వచ్చిన సమస్యలకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనివల్ల కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని మహిళ లోకానికి అభయమించారు.సేవ కోసమే రాజకీయాల్లోకి..రామచంద్రపురమే నా శాశ్వత చిరునామాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని.. రామచంద్రపురం నియోజవర్గంలోనే శాశ్వతంగా ఉంటానని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో రామచంద్రపురం నియోజవర్గం భవిష్యత్తులో జనరల్ అవుతుందని, మంత్రి సుభాష్ అమలాపురం వెళ్ళిపోతారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, శాశ్వతంగా రామచంద్రపురం నియోజవర్గంలోనే ఉంటానని హామీ ఇచ్చారు.మహిళలతో కలిసి ప్రేమ విందురక్షాబంధన్ సందర్భంగా నియోజకవర్గంలోని మహిళల కోసం మంత్రి సుభాష్ ప్రత్యేకంగా ప్రేమ విందు ఏర్పాటు చేశారు. మహిళలతో కలిసి మంత్రి భోజనం చేస్తూ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. మహిళలు తమ సమస్యలను మంత్రికి వివరించగా, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.ఆటలు.. పాటలు.. సందడిరక్షాబంధన్ వేడుకల్లో భాగంగా మహిళలకు ఉత్సాహాన్ని కలిగించేలా పలు వినోద కార్యక్రమాలు, పోటీలు నిర్వహించారు. నృత్యం, పాటల పోటీలు, అంత్యాక్షరి, టగ్ ఆఫ్ వార్, కుర్చీలాట తదితర పోటీలను నిర్వహించగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు మంత్రి సుభాష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వేడుకల్లో మహిళలు మంత్రి సుభాష్‌కు రాఖీలు కట్టి, ఆయనకు తమ ఆత్మీయతను తెలియజేశారు. కార్యక్రమం మొత్తం సందడి, ఉత్సాహంతో సాగింది.ఈ కార్యక్రమంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్,కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి, వేలాదిమంది మహిళలు, తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు హాజరై రక్షాబంధన్ వేడుకలను విజయవంతం చేశారు.