పయనించే సూర్యుడు మార్చి 17 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పట్టణ పరిధిలోని పదవ తరగతి పరీక్షలు రాసే కేంద్రాల వద్ద పోలీసులు పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన దృష్ట్యా పరీక్షల సమయంలో పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు ఆత్మకూరు సీఐ గంగాధర్ తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా కేంద్రాల సమీపంలో ఎవరు రాకూడదని ఆదేశాలు ఇచ్చారు. పరీక్షలు ప్రారంభం కావడంతో సమీపంలో ఉండే ప్రతి ఒక్కరిని కేంద్రాలకు దూరంగా పంపివేశారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయవలసిందిగా సిఐ సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా సీఐ కోరారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు