పయనించే సూర్యుడు మార్చి 15 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కల్పించేందుకు మునిసిపల్ కార్యలయము నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు ర్యాలి నిర్వహించిన ఆత్మకూరు అధికారులు.మున్సిపల్ కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించండి ప్లాస్టిక్ వద్దు పేపర్ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో ఆత్మకూరు ఆర్డీవో బి పావని. మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ టిడిపి అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్. బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు, ఎక్సైజ్ శాఖ సీఐ రవణమ్మ,అన్ని శాఖల అధికారులు, మున్సిపల్ కార్యాలయ సచివాలయ కార్యాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.