పయనించే సూర్యుడు మే 21 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మల్లెపల్లి తిరుపతయ్య)
జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఎన్నారై మీరా మొహిద్దిన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు లో రక్తదాన శిబిరం పాల్గొని రక్తదానం చేసిన ఎన్టీఆర్ అభిమానులు
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపంలో ఆత్మకూరు నియోజకవర్గ ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షులు ఎన్నారై మీరామోహిద్దీన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరాన్ని ఆత్మకూరు ఎస్సై జిలాని సందర్శించి ప్రారంభించారు.ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపర్డెంట్ శేషారత్నం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆత్మకూరు చైర్మన్ సాదిక్ హుస్సేన్, డాక్టర్ సాలెహ . రెడ్ క్రాస్ సిబ్బంది రక్తాన్ని సేకరించారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆత్మకూరు అధ్యక్షులు మీరా మొహిద్దిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు నందమూరి అభిమానులు భారీగా పాల్గొని రక్తాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మీరా మొహిద్దిన్ తో పాటు వాగాల.శ్రీహరి, సంధాని, షైవి, షారు, ఖాజాలాల్, తారీక్ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వాహకులు ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షులు మీరా మొహిద్దిన్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందని భారతదేశా రక్షణగా ఉన్న సైనికులకు సంఘీభావంగా ఈ రక్తదానం నిర్వహించినట్లు తెలిపారు. రక్తదాన శిబిరం సందర్శించిన జిల్లా అదనపు వైద్యాధికారి ఖాదరవల్లి . ఆత్మకూరు ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ సాధిక్ హుస్సేన్ లు రక్తదాన శిబిరం నిర్వహించినందుకు మీరా మోహిద్దీన్ ను అభినందించారు.ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి స్వచ్ఛందంగా ఈ శిబిరంలో పాల్గొని రక్తం అందించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.