
పయనించే సూర్యుడు డిసెంబర్ 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మానం. వెంకటేశ్వర్లు విధి నిర్వహణలో వేగవంతంగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల మేడం అభినందనలు తెలుపుతూ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించారు. తమ స్టేషన్ సిబ్బందికి ఎస్పీ ద్వారా ప్రశంస లభించడం సంతోషం వ్యక్తపరుస్తూ సీఐ గంగాధర్, ఎస్ఐ లు జిలాని, సాయి ప్రసాద్ లు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ వెంకటేశ్వర్లు ను ప్రశంసించారు. తనకు అభినందనలు తెలిపిన తమ పై అధికారులకు హోంగార్డ్ వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు.