{ పయనించే సూర్యుడు} {సెప్టెంబర్ 30} మక్తల్
నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన లాలు ఆదివారం భార్యతో గొడవపడి మక్తల్ రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకుంటానని తన మేనమామకు వీడియో కాల్ చేశాడు. వెంటనే స్పందించిన ఆయన డయల్ 100 కు సమాచారం ఇవ్వగా ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నరేష్, శ్రీహరి లు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి అతని మొబైల్ ట్రేస్ చేసి పట్టుకొని స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.