పయనించే సూర్యుడు// మార్చ్ // 17 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ పాపాయాపల్లి గ్రామంలో శనివారం రాత్రి మృతి చెందిన వ్యక్తులను, గుర్తించినట్లు మంచిర్యాల్ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. జమ్మికుంట మండలంలోని పాపయ్య పల్లె గ్రామం బిజిగిరి షరీఫ్ మధ్య, మృతి చెందిన వ్యక్తుల వివరాలు వెల్లడించారు. మెనుగు రాహుల్ ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన (18) యువకుడు, మరియు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన గోలేటి శ్వేత (20) గా గుర్తించినట్లు వివరించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్ తెలిపారు.