
రుద్రూర్, డిసెంబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
ఆదరించి గెలిపించండి అంటూ కాంగ్రెస్ పార్టీ 4 వ వార్డు మెంబర్ అభ్యర్థి యం.డి ఇమ్రాన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 4 వార్డు మెంబర్ అభ్యర్థిగా బరిలో నిలిచానని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వార్డులలో ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. గ్యాస్ పొయ్యి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. వార్డు మెంబర్ గా నన్ను గెలిపిస్తే వార్డులో రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇతర ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.